టిడిపి 100 కళాబృందాల ఏర్పాటు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు టీడీపీ కళాబృందాలకు శిక్షణ ఇస్తోంది. వెయ్యిమంది కళాకారులకు ఇందుకోసం శిక్షణ ఇస్తున్నారు. పల్లెసుద్దులు, ఒగ్గుకథ, బుర్రకథ హరికథ, యక్షగానం తదితర రూపాలద్వారా సర్కారు అవినీతిని అక్రమాలను ఎండగట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరు 100 బృందాలుగా ఏర్పడి షెడ్యూలు విడుదలైనప్పటినుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రచారంచేస్తాయి. నియోజకవర్గాలవారిగా వీరు ప్రచారం చేస్తారు. నటుడు మురళీ మోహన్, నిర్మాత శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications