హైదరాబాద్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గతంలో టీడీపీ తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే టీడీపీకి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాక ఆసక్తి రేపింది. అయితే తాను ఎందుకు వచ్చిందీ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తెలుగుదేశం మాజీ ఎంపీ, సినీనటి శారద ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.