'మహా' గర్జన రద్దు
హైదరాబాద్:ఈ నెల 9వ తేదీన సికింద్రాబాదులోని పెరేడ్ గ్రౌండులో జరగాల్సిన మహాగర్జన బహిరంగ సభను మహాకూటమి రద్దు చేసుకుంది. ఏర్పాట్లకు సమయం సరిపోవటంలేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహా కూటమి నాయకులు తెలిపారు. శనివారంనాడు హైదరాబాద్‌లో నిర్వహించిన సోనియా బహిరంగ సభ పేలవంగా ఉందని అభిప్రాయపడిన కూటమి నేతలు..'మహా' గర్జన మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని తీర్మానించారు. సోనియా గాంధీ సభ జరిగిన పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ సభ నిర్వహణ అనవసరమని భావించిన నేతలు..ఇందుకోసం హైదరాబాద్ చుట్టుపక్కల జాతీయ రహదారుల పక్కన విశాలమైన స్థలం కోసం ఆదివారం వేట మొదలు పెట్టారు. ఇక ఈ సభను చూసినవారు వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని తీర్మానించుకునేలా నాలుగు పార్టీల కేడర్ శక్తివంచన లేకుండా కృషి చేయాలని నిశ్చయించారు. అయితే అనుకోని పరిస్ధితుల్లో సభ రద్దవటం పార్టీ శ్రేణులను కొంత వరకూ నిరాశపరుస్తోంది.












Click it and Unblock the Notifications