న్యూఢిల్లీ: ఈ రోజు నుంచే ప్రధాని మన్మోహన్ సింగ్ యధావిధిగా రోజూవారి విధులకు హాజరవుతున్నారు. బైపాస్ సర్జరీ అనంతరం ఆయన వైద్యుల సూచనల మేరకు పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. దాదాపు ఆయన అయిదు వారాల పాటు రెస్ట్ లో ఉన్నారు. అలాగే చివరి లోక్ సభ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. అయితే ఇప్పుడాయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని విధులకు ఎప్పటిలాగే హాజరుకావచ్చని వైద్యులు సూచించటంతో ఈరోజు నుంచి రెగ్యులర్ ఏక్టివిటీస్ కి అటెండవనున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆయన బెనిన్ దేశాధ్యక్షుడుతో భేటీ కానున్నారు.