క్రికెటర్లపై కాల్పులు మాపై కుట్ర: పాక్
ఇస్లామాబాద్: పాక్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు అనేక విదేశీ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పాక్ హోంమంత్రి రెహమాన్ మాలిక్ ఆరోపించారు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడి వెనుక విదేశీహస్తం ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. కుట్రకు స్థానికంగా ప్రణాళిక వేయలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన స్పష్టం చేసారు. వాఘానుంచి ఇమిగ్రేషన్ రికార్డులు తెప్పిస్తున్నామని అన్నారు. అయినా అనుమానంపై 14 మందిని అరెస్టుచేశామని, మొదటి దర్యాప్తు నివేదిక 48 గంటల్లో అందుతుందని ఆయన అన్నారు.ఇదంతా విదేశీ శక్తులు తమకు ఇబ్బంది పెట్టడానికి, పేరు చెడకొట్టడానికి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications