సిఎం పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
హైదరాబాదు: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో కాంగ్రెసు ప్రతి ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని అక్కడి తెదేపా నాయకుడు సతీష్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. బూతుల ఆక్రమణ, రిగ్గింగ్, తెదేపా నాయకులపై దౌర్జన్యాలు ఇక్కడ సర్వసాధారణమయ్యాయని ఆయన ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావుకి ఫిర్యాదు చేశారు. పారా మిలిటరీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఓటింగ్ సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. కోడ్ అమల్లోకి వచ్చాక కడప జిల్లాలో కాంగ్రెస్ నాయకులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని మరో తెదేపా నేత వెంకటస్వామిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications