గాంధీ చితాభస్మం కూడా వేలానికి?
న్యూయార్క్: జాతిపిత మహాత్మాగాంధీ వాడిన కళ్లజోడు, గిన్నె, ప్లేటు, వాచ్, చెప్పులు తదితర వస్తువులను వేలానికి ఉంచిన అమెరికాకు చెందిన వేలంపాటదారు జేమ్స్ ఓటిస్ తన వద్ద ఇవే కాక మహాత్మాగాంధీ చితాభస్మం, ఆయన హత్యకు గురైన ప్రదేశంనుంచి సేకరించిన రక్తం శాంపుళ్లు కూడా ఉన్నాయని ప్రకటించాడు.
ప్రస్తుతం వీటిని తాము వేలంలో ఉంచటం లేదని ప్రకటించాడు. పాత వస్తువులకు తోడు ఢిల్లీలోని ఇర్విన్ ఆసుపత్రివారు ఇచ్చిన గాంధీ బ్లడ్ రిపోర్టు, అక్కడి విద్యార్థులకు గాంధీ పంపిన టెలిగ్రామ్ కూడా ప్రస్తుత వేలంలో ఉంచుతున్నట్లు ప్రకటించాడు. ఈ వేలాన్ని చూసేందుకు మీడియాకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications