న్యూఢిల్లీ: కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సినీనటి న గ్మా ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున హైదరాబాద్ లోక్ సభ స్ధానానికి పోటీ చేస్తారని విన్పించినా, ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మ హారాష్ట్ర కాంగ్రెస్ స్క్రీనింగ్ కమి టీ సభ్యుడు, కర్ణాటక మాజీ మంత్రి మల్లిఖార్జున కర్గేను ఆమె బుధవారం కలిశారు. ముం బై ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నగ్మా ఆసక్తిగా ఉన్నారని కర్గే తెలిపారు. టికెట్ ఇచ్చే విషయాన్ని సీనియర్ నేతలే నిర్ణయిస్తారన్నారు. నగ్మా ఇప్పుడు భోజ్ పురి సినిమాల్లో బిజీగా ఉన్నారు.