సంజయ్ దత్ సమరోత్సాహం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కోర్టును అభ్యర్థించారు. ఈమేరకు ఆయన ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సంజయ్‌దత్ 1993 ముంబయి పేలుళ్ల కేసులో ముద్దాయిగా ఉన్నారు. కోర్టు కేసు ఉన్నందున ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలు లేదు.
సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీచేసేందుకు ఆయన ఇటీవల ఉత్సాహం చూపుతున్నారు. అందుకే ఆ కేసులో తాను కావాలని తప్పు చేయలేదని ప్రత్యేక కోర్టు కూడా అభిప్రాయపడినందున స్టే ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీచేయగలుగుతారు. ఈ కేసును కోర్టు రేపు విచారించనుంది.












Click it and Unblock the Notifications