చంద్రబాబుకి చిరు కౌంటర్

ఖానాపూర్, ఉట్నూర్, మానాపూర్, అదిలాబాద్ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడకు చేరుకున్న చిరంజీవి, ప్రజారాజ్యం పేదల పార్టీ అని చెప్పారు. అధికార దాహంతో తలాతోక లేకుండా నేతలు ఇస్తున్న హామీలను నమ్మవద్దని కోరారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు రూ.500 ప్రతీ నెలా అందజేయగలమని తెలిపారు.
ఇక బాబు నిన్న ప్రకటించిన మేనిపేస్టో ఇలా ఉంది. నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా రెండువేల రూపాయలు, పేద కుటుంబానికి నెలకు రూ.1500లు, మధ్య తరగతికి వెయ్యి రూపాయలు నగదు రూపంలో ఇస్తామని హామీ ఇచ్చింది. వృద్ధాప్య ఫించన్లు, నిరుద్యోగ భృతి మొత్తాలు ఈ పథకంలో కలిసిపోతాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉచిత బియ్యం తదితర వస్తు రూపంలో ఇచ్చేవి దీనికి అదనంగా ఉంటాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కష్టించి ఇంటికి చేరే పేద వారికి వినోదం కోసమంటూ ఉచితంగా కలర్ టీవీలు ఇస్తామని ప్రకటించింది. కలర్ టీవీల్లేని ప్రతి కుటుంబానికి వీటిని ఇస్తామని హామీ ఇచ్చింది. సుమారు కోటి మందికి ఈ పథకం కింద లబ్ది చేకూరుస్తామని ఉద్ఘాటించింది.












Click it and Unblock the Notifications