చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి జయలలితను ఆడసైతానుగా అభివర్ణించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బుధవారం విడుదలజేసిన ఓ ప్రకటనలో 'కరుణానిధి ఇక విశ్రాంతి తీసుకోవడం ఆయనకూ, రాష్ట్రానికీ మంచిది' అని అనడంపై మండిపడ్డారు. ఆయన గురువారం విడుదలజేసిన ఓ ప్రకనటలో 'నేను విశ్రాంతి తీసుకుంటే రాష్ట్రాన్ని ఓ ఆడసైతాను భోంచేసేస్తుందన్న భయం మాత్రమే నన్ను ఆపుతోంది' అని వ్యాఖ్యానించారు.