కాంగ్రెస్ లో అవమానాలు: మాగంటి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగినందుకే టీడీపీలో చేరినట్లు మాజీ మంత్రి మాగంటి బాబు వెల్లడించారు. తన ఇద్దరు కుమారులతో సహా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం జరిగిన జడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను ఏ తప్పు చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీ శిక్ష విధించిందని మాజీమంత్రి మాగంటి బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా కూడా తాను ఏమాత్రం బాధపడకుండా ఏలూరు లోక్ సభ స్థానాన్ని ఆశించానని కానీ అధిష్ఠానం నుంచి సరైన సమాధానం రాలేదని ఆయనన్నారు. కాంగ్రెస్ తనకు తీరని అన్యాయం చేసిందని, తన కుటుంబం ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవచేస్తున్నప్పటికీ తన కుటుంబంలో ఎవ్వరూ పూర్తిస్థాయిలో మంత్రి పదవి అనుభవించినవారులేరని ఆయన అన్నారు. ఇక ఈ సందర్భంగా మాగంటి బాబు కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధన్యత లేదని, ఎన్నోసార్లు అవమానానికి గురయ్యానని, దీనికితోడు టీడీపీ ప్రజలకు మేలు చేస్తుందని భావించి చేరానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications