సామాన్యులకు రక్షణేది? బాలయ్య

Balakrishna
నెల్లూరు: రాష్ట్రప్రజలకు నేడు రక్షణ కరువైందని సినీనటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లాలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు బాలాయపల్లి రోడ్‌ షోలో పాల్గొన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వై.ఎస్‌ హయాంలో ఎరువుల గోడౌన్లపై దాడులు ఎందుకు జరిగాయని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా వాటి మూలాలు రాష్ట్రంలో ఉంటున్నాయన్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగి సామాన్య, మథ్యతరగతివారు బలకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని ఎక్కడినుంచైనా ఎన్నికలబరిలోకి దిగుతానని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన మేనిపేష్టో గురించి మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం పెరిగిన దృష్ట్యా పార్టీ ప్రకటించిన పథకాలకు ఎలాంటి ఇబ్బందులుండవని స్పష్టం చేశారు.

నిన్న బాలకృష్ణ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాటి వివరాలు:
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బాలకృష్ణ ఎన్నికల ప్రచారయాత్రను ఆదివారం ఉదయం 9.10 గంటలకు బాలకృష్ణ చైతన్యరథం ఎక్కి ప్రారంభించారు. ఈనెల12వరకూ నెల్లూరు జిల్లాలో పర్యటించి 16నుంచి 20వరకూ ప్రకాశం జిల్లా పర్యటనను చైతన్యరథంపై బాలకృష్ణ నిర్వహిస్తారు.

రెండో విడత నెల్లూరి జిల్లా తడ నుంచి మొదలు అవుతున్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా చైతన్యరథం రెడీ చేసారు. పలు ప్రత్యేక సౌకర్యాలతో అధునాతన ఆడియో సౌకర్యంతో రూపొందించిన చైతన్య రథానికి విజయవాడలోని బెంజిసర్కిల్‌ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం బాలకృష్ణ మిత్రులు కాళేశ్వరి ట్రావెల్స్‌ అధినేత చలసాని రవి, చలసాని తేజ, బొర్రా గాంధీ ప్రత్యేకపూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లో స్వరాజ్‌మజ్దా వాహనాన్ని పసుపురంగుతో అలంకరించి బాలయ్య బొమ్మలు ముద్రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+