పీఆర్పీ కన్వీనర్‌పై కేసు
సూర్యాపేట: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నల్గొండ జిల్లా ప్రజారాజ్యం కన్వీనర్ పాదూరి అరుణ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆమె సూర్యాపేట గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజి హాస్టల్‌లో సమావేశం నిర్వహించారు. అయితే ఆమె అనుమతి లేకుండా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజారాజ్యం విధానాలను, మహిళలపట్ల తమ విధానాలను ఆమె వివరించారు. అయితే ఆ సమయంలో వార్డెన్ లేరు. వచ్చిన వెంటనే విషయం తెలిసుకుని అనుమతి లేకుండా తమ కాలేజీలో సమావేశం నిర్వహంచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో కరుణ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు రుజువు కావటంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయటం జరిగింది.












Click it and Unblock the Notifications