భువనేశ్వర్: ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బల పరీక్షలో విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పరీక్షలో ఆయన 8 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆయనపై కుర్చీలు విసిరి వ్యతిరేక నినాదాలు చేశారు. భాజపా, కాంగ్రెస్‌లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా నవీన్ పట్నాయక్ బల పరీక్షలో నెగ్గటం విశేషం. తృతీయకూటమి మద్దతు ప్రకటించటం, క్రాస్‌ఓటింగ్ ఆయన విజయానికి దోహదపడ్డాయి. పరీక్ష అనంతరం తీవ్ర గందరగోళం మధ్య సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది.