హైదరాబాద్: సీఎం క్యాంప్ కార్యాలయం ఈరోజు టిక్కెట్లు ఆశిస్తున్నవారితో కిటకిటలాడింది. ఈరోజు ముఖ్యమంత్రిని కలిసినవారిలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సినీనటి జీవిత, రాజశేఖర్‌లు చాలాసేపు సీఎంతో మాట్లాడారు. వారు టికెట్లను ఆశించకపోయినా, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తామని స్వచ్చందంగా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా ఆయనను కలిశారు. ఈరోజు సీఎం తిరిగి ఢిల్లీ వెళుతుండటంతో టిక్కెట్లు ఆశిస్తున్నవారు పెద్దఎత్తున కార్లు, బస్సుల్లో వచ్చారు.