ఉర్రూతలూగిస్తున్నజూ. ఎన్టీఆర్

ఇక్కడినుంచే తన తాతగారు ఎన్టీఆర్ తన ప్రజల ఆశీస్సులతో చైతన్యయాత్ర ప్రారంభించి 35 వేల కిలోమీటర్లు తిరిగారని గుర్తు చేశారు. పేద బలహీన వర్గాలను ఆదుకునేందుకు, వారిక కూడు, గుడ్డ కల్పించేందుకు టీడీపీ ఆవిర్భవించిందని అన్నారు. ఆయన ఆశయాలనే చంద్రబాబునాయుడు కూడా కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు రూపుమాసిపోవటం చూడలేకే ఆయన కుటుంబసభ్యులమంతా వచ్చామన్నారు. తాము ఎన్టీఆర్‌కు వారసులం కాదని కుటుంబసభ్యులం మాత్రమేనని ఆయన అన్నారు.
కార్యకర్తలే ఆయనకు వారసులని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు. కడిఎడమల ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. రైతే రాజన్నారు మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని, విత్తనాలకోసం రోడ్లమీద ఎందుకు రైతన్న ధర్నాలకు దిగాడని ప్రశ్నించారు. ఏ పార్టీ అయితే ప్రజలకోసం పుట్టిందో దానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. తెలుగువాడి పౌరుషాన్ని తిరిగి చాటాలని, ఒక్కొక్కరు ఒక్కో అల్లూరి సీతారామరాజులా, బొబ్బిలిపులిలా మారి అవినీతి సర్కారును తరిమికొట్టాలని, టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఆయన ప్రసంగానికి ప్రజలనుంచి భారీ స్పందన లభించింది. మొదటిసారి ఆయన ప్రజల్లోకి రావటంతో జనం వరదలా వచ్చారు. ఆయనను అడుగడుగునా ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications