మేమే పెద్ద యాక్టర్లం: బొత్స
విశాఖపట్నం: "మేమే పెద్ద యాక్టర్లం. మాకు యాక్టర్లెందుకు. మాకే చాలా మంది అభిమానులు ఉన్నారు" వివిధ పార్టీలకు సినిమా తారలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం ఇది. బుధవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల గురించి అడిగినప్పుడు మంత్రి అనేకసార్లు కోడ్ గుర్తుచేసుకున్నారు. నియమావళి పరిధిలోకి వస్తే ఇబ్బందని, తనను ఇరుకున పెట్టవద్దని పదేపదే సూచించారు. పేదల కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై విపక్షాలు రాద్ధాంతం చేసి అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎన్నికల కోడ్ సాకుతో అడ్డుకుంటున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇందిరమ్మ పథకం ఇప్పటికే అమల్లో ఉన్నందున దాన్ని ఆపవద్దని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. "నాలుగేళ్ల 11 నెలల కాలంలో మా ప్రభుత్వం అనేక సంచలన పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తున్నాం. 70 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణానికి వేసవి అనువైన సీజన్. కానీ విపక్షాలు స్వార్థ బుద్ధితో అడ్డుకుంటున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్లే బుద్ధి చెబుతారు" అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్ని టిక్కెట్లు అడుగుతున్నారని అడగ్గా.. కేటాయింపులో కుటుంబాలు, స్నేహాలు, బంధాలు ఉండవని..ఎవరు గెలిస్తే వాళ్లకే టికెట్లు ఇస్తారని బదులిచ్చారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications