ముంబయి: ఎన్నికల్లో గెలుపు ఓటమిలపై జోరుగా బెట్టింగులు ప్రారంభమయ్యాయి. క్రికెట్‌లోలాగానే ఇక్కడ కూడా కోట్ల ధనం జేబులు మారనుంది. అందుకోసం అప్పుడే ప్రముఖ బుకీలు శోభన్ మెహతా, లక్ష్మీ చంద్ తానా, రమేష్ గోయల్, సోనూ చెంబూర్ వంటివారు అప్పుడే రంగంలోకి దిగారు. మనదేశం లోను, బయటకూడా తమ బలగాలను రంగంలోకి దించారు. వారి బెట్టింగ్ అంశం ఈసారి ప్రధాని మన్మోహనా లేక అద్వానీయా అనేదే. చాలా చోట్ల మన్మోహన్‌కు అనుకూలంగా అప్పడే బెట్టింగులు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికెన్ని సీట్లు ప్రత్యేక సీట్లలో విజేతలు తదితర విషయాలపై బెట్టింగులు జరగనున్నాయి. ఇదో రకం వ్యాపారం..మజా.