రైతులకు పావలా వడ్డీకే అప్పు: బాబు
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీడీపీ ప్రజలపై మరిన్ని ఎన్నికల వరాలు కురిపిస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో ఆపార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయిన చంద్రబాబు నాయడు రైతులకు వరాలు కురిపించారు. రైత న్నల కోసం వ్యవసాయ ముసాయిదా పథకాన్ని ప్రకటించారు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తామని, అలాగే పగటి పూట 12 గంటలు నాణ్యమైన కరెంటును రైతన్నటకు అందిస్తామని చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్‌ట భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు ప్రకటించారు. సాగు నీటిపై పన్నును పూర్తిగా రద్దు చేస్తామని, 75 శాతం రాయితీతో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు ఇస్తామని బాబు వివరించారు. సన్న, చిన్నకారు రైతులకు రూ. 25 వరకు వడ్డీలేని రుణం ఇస్తామని బాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications