చిరంజీవి కృష్ణాజిల్లా పర్యటన వాయిదా
హైదరాబాద్: చిరంజీవి రేపటి నుంచి కృష్ణాజిల్లాలో పర్యటించవలసి ఉండగా ఆయన పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. ఎంతో రాజకీయ చైతన్యం గల కృష్ణాజిల్లాలో చిరంజీవి పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కమ్మ-కాపు వైరుధ్యం ఈ జిల్లాలో ఉన్నంతగా మిగితా ఎక్కడా లేదు. మొదటి నుంచి ఈ జిల్లా చిరంజీవికి సమస్యాత్మకంగా మారింది. జిల్లాలో ప్రజారాజ్యం నాయకుల మధ్య సయోధ్య లేదు.
లోక్ సభ స్ధానాలకు పోటీ చేయగల సత్తా ఉన్న నాయకుల కొరత ఆ పార్టీలో ఉంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్ కు మచిలీపట్నం లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నా ఆయనకు ఇంకా క్లియరెన్స్ రాలేదు. ధనబలం, బీసీ జన బలం రెడ్డయ్యకు ఉన్నా ఆయన అభ్యర్ధిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications