టిడిపి నుంచి కాంగ్రెస్ కు గుత్తా
హైదరాబాద్ : తెలుగుదేశానికి రాజీనామా చూసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి తన మద్దతుదారులతో కలిసి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సర్కారుచేపట్టిన సంక్షేమ పధకాలను చూసి గుత్తా తమ పార్టీలో చేరినట్టు డీఎస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎక్కడ పోటీచేయమంటే అక్కడినుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని సుఖేందర్‌రెడ్డి అన్నారు.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న గుత్తా నల్గొండ జిల్లాలో ముఖ్య నాయకుడు. జిల్లాలో మరో వర్గానికి చంద్రబాబు నాయుడు వత్తాసు పలకడంతో గుత్తా మనస్ధాపం చెంది నేడు కాంగ్రెస్ లో చేరారు.












Click it and Unblock the Notifications