విజయనగరంలోనూ ఎన్టీఆర్ హవా
విజయనగరం : కాంగ్రెస్ దుష్టపాలనను తరిమికొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో హరితాంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన అనంతరం వందలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రవేశపెట్టిన అన్నీ పధకాల్లో మహిళలకే అగ్రస్థానం లభించిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజల ఆస్తులను అప్పనంగా స్వాహా చేస్తున్న కాంగ్రెస్ పాలన అంతం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications