హైదరాబాద్: ఉమ్మడి గుర్తు కేటాయించాలంటూ ప్రజారాజ్యం పార్టీ వేసిన పిటీషన్‌పై హైకోర్టు తన వాదనలు రేపటికి వాయిదా వేసింది. దీంతో ఆ పార్టీ నేతలు గుర్తుపై మరో రోజు ఎదురుచూడాల్సిందే. ఒకే గుర్తు రాకపోతే ప్రజారాజ్యం పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్ధితి ఉంది. ఉమ్మడి గుర్తును కేటాయించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌ను ఈరోజు ప్రజారాజ్యం పార్టీ ఉపసంహరించుకుంది. ఇదే అంశంపై ఈరోజు హైదరాబాద్‌లో హైకోర్టు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా పిటీషన్‌ను ఉపసంహరించేందుకు కారణాలు తెలియరాలేదు.