పాక్ లో మానవబాంబు ప్రేలుడు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో మరో సారి తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. రావల్పిండిలోని పీర్‌ వధాయి చౌక్‌ వద్ద కిక్కిరిసిన ఓ బస్సులో ఈ ధుర్ఘటన చోటుచేసుకుంది. లోకల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తీవ్రవాది బాల్‌బేరింగ్స్‌ను తన జాకెట్‌లో ఉంచుకుని పేల్చుకోవటంతో ఆత్మాహుతిదళ బాంబుదాడి చేసారని తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. తీవ్రవాది బాల్‌బేరింగ్స్‌ను తన జాకెట్‌లో ఉంచుకుని పేల్చుకోవటంతో వేగంగా అవి ఎగిరివచ్చి తగలాయి.

దాంతో పలువురు తీవ్ర స్ధాయిలో గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్ధానికలు వీరందరినీ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక ప్రేలుడు ప్రభావంతో దగ్గరలోని అనేక వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఐదు వాహనాలు పూర్తిగా నాశనమయ్యాయి. పరిస్ధితులు చక్కదిద్దేందుకు ప్రభుత్వాధికారులు రంగంలోకి దిగారు. అయితే ఇప్పటివరకూ ఎవరూ ఈ ప్రేలుళ్ళకు బాధ్యలమని ప్రకటించుకోలేదు. పాక్ ప్రధాని గిలాని ఈ ప్రేలుళ్ళను ఖండిస్తూ వెంటనే ఇన్విస్టిగేషన్ ప్రారంభించమని పోలీస్ అధికారులకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+