ముద్రగడ కుమార్తెను అడ్డగింత- నాడే పద్మనాభం చెప్పారంటూ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు నివాళి అర్పించేందుకు వచ్చిన ఆయన కుమార్తెను మద్దతు దారులు అడ్డుకున్నారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ముద్రగడ పద్మనాభం భౌతిక ఖాయాన్ని కిర్లింపూడిలోని ఆయన ఇంటికి తరలించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మాజీ సీఎం జగన్ ముద్రగడకు నివాళి అర్పించనున్నారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ముద్రగ కడచూపు కోసం వచ్చిన కుమార్తెను మద్దతు దారులు అడ్డుకున్నారు. తాను చనిపోయినా క్రాంతి రావద్దని నాడు ముద్రగడ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు. అయితే, ఆ తరువాత కుటుంబ సభ్యుల అనుమతితో క్రాంతిని పోలీసులు అనుమతించారు. ఆ సమయంలో కొంత సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తొలుత ప్రత్తిపాడు వద్ద క్రాంతిని అడ్గుకున్న పోలీసులు ఆ తరువాత ఇంటి వరకు అనుమతించారు.

ఇంటి ఆవరణలోనే అంత్యక్రియలు
కాగా, ముద్రగడ అంత్యక్రియలు ఆయన ఇంటి ఆవరణలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ముద్రగడ కుమార్తె క్రాంతి 2024 ఎన్నికల ముందు తన తండ్రితో విభేదించి జనసేనలో చేరారు. పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ సమయం నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. ఇక.. ముద్రగడ మరణం పైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా... పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మాజీ సీఎం జగన్ భీమవరం నుంచి కిర్లంపూడి వెళ్లనున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి.. ముద్రగడకు నివాళి అర్పించనున్నారు. కాపు సంఘాల నేతలు.. ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో కిర్లంపూడికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications