హైదరాబాద్: పాదయాత్రను విమర్శిస్తున్న పిచ్చివాళ్ల వ్యాఖ్యలకు తనను జవాబు అడగడం కూడా సరికాదని తీవ్రంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించారు. భూముల సర్వే కోసమే ముఖ్యమంత్రి పాదయాత్ర చేశారు..అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి వైఎస్ నిరాకరించారు. ఒక ప్రైవేటు చానల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే బాబాయ్, అబ్బాయ్ ల ప్రచారానికి లభిస్తున్న హంగామాలో కొత్తేమీ లేదన్నారు. మొదట్లో చిరంజీవికి కూడా ఇలాంటి హంగామా లభించిందని గుర్తు చేశారు.