తిరగబడండి, తెగబడండి: ఎన్టీఆర్

కాంగ్రెసు అవినీతితో రాష్ట్రం పరువు ఇతర రాష్ట్రాల్లో మంట గలుస్తోందని, ఇది మనకు సిగ్గుచేటని, మనం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కోస్తా కారిడార్ పేర ప్రభుత్వం ఉపయోగకరమైన భూమిని లాక్కుంటోందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెసు నాయకులకు ఉపాధి లభిస్తోందని, ప్రజలకు హామీలు మాత్రమే మిగులుతున్నాయని ఆయన అన్నారు. అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రాన్ని ఆహారం కొరత చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications