న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు సుదర్శన్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆర్ఎస్ఎస్ మూడు రోజుల అఖిల భారత ప్రతినిధుల సభలు శుక్రవారం నుంచి జరుగుతున్నాయి. కొత్త అధ్యక్షుడి నియమాకాన్ని సుదర్శన్ శనివారంనాడు ప్రకటించారు. సుదర్శన్ స్థానంలో మోహన్ భవత్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
సుదర్శన్ తొమ్మిదేళ్ల పాటు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పని చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మోహన్ భగవత్ స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా సురేష్ సోని బాధ్యతలు స్వీకరిస్తారు.