అమెరికాలో 4గురు ఆంధ్రుల మృతి
తిరువూరు: అమెరికాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇల్లినాయిస్‌నుంచి సెయింట్‌లూయీస్ వెళ్తున్న కారును రాంగ్‌రూటులో వస్తున్న పోలీసువాహనం ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో విజయవాడకు చెందిన అనూష అనుమోలు, సత్య సుధాకర్‌లు, హైదరాబాద్‌కు చెందిన ప్రియదర్శిని ముప్పవరపు, విశాఖకు చెందిన అనిత వీరపనేనిలు మృతి చెందారు.
వాహనాన్ని నడుపుతున్న నితీష్ అడుసుమిల్లి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. మృతులు నలుగురూ ఈస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్శిటీలో ఎంఎస్ ఫైనలియర్ చదువుతున్నారు. వీరిలో అనితకు ఇటీవలే నితీష్‌తో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త ఆహ్వానం మేరకు అనిత ఇల్లినాయిస్ వెళ్లింది. అక్కడ ఇల్లినాయిస్‌లో ఉన్న స్నేహితులతో కలిసి సెయింట్‌లూయీస్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలియగానే సెయింట్‌లూయీస్ తెలుగుసంఘానికి చెందిన బండి ప్రసాద్, వి.త్రిజాకరరావు, పాతూరి సురేష్, అట్లూరి సుధీర్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతుల తల్లిదండ్రులతో వారు మాట్లాడి వివరాలు తెలియజేశారు. తదుపరి ఏర్పాట్లు కూడా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications