తెలంగాణా జాతీయ అంశం కాదు: సీపీఐ
హైదరాబాద్: తెలంగాణా అంశం జాతీయస్థాయిలో చర్చించాల్సిన అంశం కాదని సీపీఐ నేత గురుదాస్‌దాస్‌గుప్తా అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోవాలా వద్దా అనేది ఆంధ్రప్రదేశ్‌లోనే తేల్చుకోవాలని ఇందులో జాతీయ నాయకుల పాత్ర ఉండదని అన్నారు.
బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తరువాత తృతీయఫ్రంట్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యుపిఏలో ఉన్న అనేక పార్టీలు ఇప్పటికే తమవైపు దృష్టిసారించాయని, ఎన్నికల అనంతరం మరింతమంది తమతో కలుస్తారని అన్నారు.












Click it and Unblock the Notifications