కాశ్మీర్లో ఎదురుకాల్పులు: 8మంది మృతి
శ్రీనగర్: కాశ్మీర్‌లోయలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు సైనికులు, ఓ మేజర్, నలుగురు మిలిటెంట్లు ఉన్నారు. కుప్వారా జిల్లాలోని చోకిబాల్ ప్రాంత అడవుల్లో రెండు చోట్ల ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్ బ్రార్ తెలిపారు. మూడురోజులుగా ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా ఉర్వి సెక్టర్‌లో నిన్న నియంత్రణ రేఖవద్ద పాక్, భారత్ సైనికుల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో ఒకరు గాయపడినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications