ప్రతిష్టంభనపై టీడీపీ, తెరాస చర్చలు
హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించటం, రేపటినుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుండటంతో మహాకూటమిలో సర్దుబాట్లపై చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. కమ్యూనిస్టులతో సర్దుబాట్లు పెద్ద సమస్య కాకున్నా ప్రధానంగా టీడీపీ, తెరాసల మధ్య పలు సీట్లపై ప్రతిష్టంభన నెలకొంది. ఆందోలు, మెదక్, నిజామాబాద్ రూరల్, పాలకుర్తి, నర్సాపూర్, మానకొండూర్, నర్సంపేట, పరకాల, సిరిసిల్ల, భువనగిరి, ముషీరాబాద్, శేరిలింగంపల్లి తదితర స్థానాల్లో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈరోజు ప్రారంభమైన టీడీపీ పౌలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై సీరియస్‌గా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తెరాసను వదిలి పోటీచేద్దామని, సర్దుబాట్లు పార్టీకి నష్టం కలిగించేలా ఉండవద్దని పలువురు కోరుతున్నారు. మరోవైపు తెరాస ముఖ్యనేతలతో కేసీఆర్ ఈరోజు అత్యవసర చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అవసరమైతే తాము ఒంటరిపోరుకు సిద్ధమని తెరాస నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications