హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కత్తి వీరుడు కాంతారావు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

TL Kantha Rao
హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో జానపద కథా నాయకుడిగా, కత్తి యుద్ధ వీరుడిగా పేరు పొందిన ప్రముఖ సినీ నటుడు టిఎల్ కాంతారావు ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఆయన అసలు పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం బిపి తగ్గడంతో అకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాంతారావు మృతికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తదితరులు సంతాపం ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కాంతారావు 1923 నవంబర్ 16వ తేదీన నల్లగొండ జిల్లాలోని కోదాడ మందలం గుడిబండలో జన్మించారు. ఆయన హెచ్ఎం రెడ్డి నిర్మించిన నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రతిజ్ఞ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. విఠలాచార్య దర్శకత్వంలోని పలు జానపద సినిమాల్లో ఆయన కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. లవకుశ చిత్రంలోని పాత్రకు ఆయన జాతీయ పురస్కారం వచ్చింది. 2000ల్లో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్తరించింది. ఆయన నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X