అమృత్ సర్: ప్రధాని మన్మోహన్ సింగ్ సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయాన్ని ఈ ఉదయం సందర్శించారు. భార్య గురుశరణ్ కౌర్‌తో కలిసి వచ్చిన ప్రధాని మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత తొలి సారిగా ఆయన ఇక్కడి వచ్చారు. ఆలయంలో ఆయన ఆరగంటపాటు ముకుళిత హస్తాలతో కూర్చుని గుర్జానీ విన్నారు. తర్వాత గంట సేపు ఇతర భక్తులతో కలిసి అక్కడ గడిపారు. ఈ సమయంలో మన్మోహన్ వెంట శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్‌సింగ్ కూడా ఉన్నారు.