వైయస్, బాబు ఆన్ లైన్ పోరు
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసం వైయస్ రాజశేఖర రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య ఆన్ లైన్ పోరు సాగుతోంది. ఐటీ సావీగా పేరు పొందిన చంద్రబాబును ఢీకొట్టడానికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎస్, వుయ్ విల్ పేర బ్లాగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవడంలో వైయస్ శక్తిమంతుడని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య కొనియాడుతున్నారు.
ఇదిలా ఉంటే, చంద్రబాబు రాష్ట్రంలోని ఓటర్లను ఎస్ఎంఎస్ ల ద్వారా పలకరిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామనే వంటి హామీలు ఇస్తూ చంద్రబాబు పేర రాష్ట్రంలోని ఓటర్లకు ఎస్ఎంఎస్ లు వస్తున్నాయి. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి తామే కారణమని తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు అంటున్నారు.












Click it and Unblock the Notifications