ఇష్టారాజ్యం ఇక అంతం: చిరు
హైదరాబాద్: ప్రస్తుత ఇష్టారాజ్యానికి ప్రజారాజ్యాన్ని గెలిపించడం ద్వారా అంతం పలకాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారంనాడు కూడా తన యాత్రను తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగించారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యం కొనసాగుతోందని, అవినీతి పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తుశుద్ధి ప్రస్తుత పాలకులకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలు పేకమేడల్లా కూలిపోతాయని ఆయన అన్నారు.
కాంగ్రెసు అవినీతి పాలనకు ప్రజలు సమాధానం చెప్తారని ఆయన అన్నారు. తనకు ప్రజల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉందని ఆయన చెప్పుకున్నారు. ప్రజలు తనను మనసులో పెట్టుకుని ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు ప్రజల సమస్యలను పరిష్కరించే మనసు, తపన ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చి అవినీతి రాజ్యం పోతుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం పని చేస్తున్న పార్టీ తమది ఒక్కటేనని ఆయన చెప్పుకున్నారు.