వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆరోపణలు గిట్టనివారి కుట్ర: కెసిఆర్
మెదక్: తాము టిక్కెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఖండించారు. తమపై ఆరోణలు తామంటే గిట్టనివారు చేసిన కుట్ర అని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. మెదక్ లోకసభ స్థానానికి విజయశాంతి నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అంతకు ముందు ఆనయ పూజలు చేశారు. విజయశాంతిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
సీట్ల సర్దుబాటు ప్రకారమే సీట్లు కేటాయించామని ఆయన చెప్పారు. పార్టీ టిక్కెట్ల కేటాయింపు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెరాస ప్రధాన కార్యదర్శి సుహాసిని రెడ్డి పార్టీ రాజీనామా చేశారు. వరంగల్ లోకసభ సీటును పరమేశ్వర్ కు ఇవ్వడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.