'సూర్య' పై అల్లు అరవింద్ ఫిర్యాదు

రాష్ట్ర చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ తో "సూర్య" పత్రిక నేడు ఇంటర్వ్యూను ప్రచురించింది. అందులో నట్టికుమార్ అల్లు అరవింద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. చలనచిత్ర కార్మికులకు పిడికెడు అన్నం పెట్టని వ్యక్తి అనకాపల్లి ఓటర్లకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనితో వళ్ళు మండిపోయిన అల్లు అరవింద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వీళ్లు సొంత పరిశ్రమలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేయలేదు. కానీ, పవన్ కల్యాణ్, నాగబాబు సరైన విధానాలున్న వాళ్లు. సామాజిక న్యాయంచేసే శక్తి వాళ్లకే ఉంది. ఎప్పటికైనా పవన్ కల్యాణే పీఆర్పీ అధ్యక్షుడు. రేపటి ఎన్నికల్లో పీఆర్పీ ఓడిపోతే దానికి కారణం చిరంజీవి, పవన్ కల్యాణ్ కాదు. కచ్చితంగా అల్లు అరవిందే' అని నట్టికుమార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications