పంజాబ్‌లో పేలుళ్లు: 35 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో తీవ్రవాదుల చర్యలు ఆగడం లేదు. ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాడులకు తెగబడుతూ సామాన్యుల ప్రాణాలను బలిగొంటున్నారు. శనివారం ఇస్లామాబాద్ ఉగ్రవాదుల పేలుడులో 8మంది మరణించిన ఘటన మరిచిపోకముందే ఆదివారం మళ్లీ పేలుళ్లు జరిగాయి. పంజాబ్‌లోని చక్వాల్‌లో ఓ మసీదువద్ద సంభవించిన పేలుళ్లలో 35 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి పాల్పడింది ఏ గ్రూపు అనేది తెలియడం లేదు.
ఆత్మాహుతి దళ సభ్యుడు చక్వాల్ లోని ప్రార్థనా మందిరంలోకి చొరబడి తనను తాను పేల్చేసుకున్నాడు. ప్రభుత్వాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రావల్పిండి, ఇస్లామాబాద్ ల్లోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications