వైయస్ కు ఖమ్మ జిల్లాలో నిరసన
ఖమ్మం: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఖమ్మం జిల్లాలో నిరసన వ్యక్తమైంది. జలగం వెంకట్రావు అనుచరులు ముఖ్యమంత్రి బహిరంగ సభ నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత అభ్యర్థి రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేణుకా చౌదరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జలగం వెంకట్రావుకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఈ నిరనస వ్యక్తమైంది.
జలగం వెంకట్రావుకు టిక్కెట్ ఇవ్వాలనే అనుకున్నామని, అయితే దళితులకు టిక్కెట్ ఇవ్వాల్సి రావడం వల్ల జలగం వెంకట్రావుకు ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము జలగం వెంకట్రావుకు మరో రూపంలో సముచిత స్థానం ఇవ్వాలని అనుకున్నామని, అయితే జలగం వెంకట్రావు తొందరపడ్డారని ఆయన అన్నారు. తాను జలగం వెంకట్రావుతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో నిరసనకారులు సద్దుమణిగారు.












Click it and Unblock the Notifications