తిరుపతిలో "మెగా"ప్రచారం
తిరుపతి: చిరంజీవి అత్యంతగా ఇష్టపడే తిరుపతి స్ధానంలో ప్రచారం ఉదృతంగా సాగుతోంది. తిరుపతిలో పోటీ చేస్తున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం ప్రారంభించారు. చిరంజీవి సోదరి మాధవి, నాగబాబు భార్య పద్మజ, ఇతర కుటుంబసభ్యులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. తిరుపతి కొర్లగుంటనుంచి వీరు ప్రచారం ప్రారంభించారు. ప్రజారాజ్యం మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ చిరంజీవికి ఓటు వేయాలని కోరారు. మూడు రోజులపాటు చిరంజీవి కుటుంబసభ్యులు తిరుపతిలోనే ప్రచారం నిర్వహిస్తారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్, సుస్మితల రైలు యాత్ర రేపు తిరుపతిలోనే ముగుస్తుంది. 21న చిరంజీవి తిరుపతిలో రోడ్‌షో నిర్వహిస్తారు. పోలింగ్‌రోజు చిరు అక్కడే ఉంటారు.












Click it and Unblock the Notifications