హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రజలను, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని బిజెపి నేత, సినీ నటుడు కోట శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మహాత్ముల ఫొటోలు పెట్టుకుని చిరంజీవి మోసానికి దిగారని ఆయన అన్నారు. మహాత్ముల ఫొటోలు పెట్టుకోవడం తప్ప చిరంజీవికి కార్యాచరణ లేదని ఆయన విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ ఎందుకు పుట్టిందో తెలియదని ఆయన అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ ఒక కుటుంబ వ్యవస్థ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను కూడా విశ్వసించవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు.