మున్నాబాయ్ పై మాన్యత అలక

Sanjay Dutt
లక్నో: సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై ఆయన భార్య మాన్యత అలక వహించారు. లక్నో నుంచి లోకసభకు పోటీ చేయాలనుకున్న తన ఆశలపై సంజయ్ దత్ నీళ్లు చల్లడమే అందుకు కారణమని తెలుస్తోంది. నేర చరిత వల్ల లక్నో నుంచి సంజయ్ దత్ పోటీ చేయడానికి అవకాశం లేకపోవడంతో మాన్యత పోటీ చేస్తుందని అందరూ భావించారు. అయితే, ఎన్నికల్లో మాన్యత పోటీ చేయదని ఆయన చెప్పారు. దాంతో మాన్యత అలక వహించినట్లు చెబుతున్నారు.

సంజయ్ పై అలిగిన మాన్యత విదేశాలకు వెళ్లి పోయింది. సముద్ర తీరంలో సేద తీరుతూ అలసట తీర్చుకుంటోందని అంటారు. ఆమె లండన్ కూడా వెళ్తారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. చివరకు ఎన్నికలు ముగిసిన తర్వాతనే దేశంలో అడుగు పెట్టాలని ఆమె అనుకుంటున్నారని సమాచారం. అయితే, సమాజ్ వాదీ పార్టీ కోసం సంజయ్ దత్ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన సభలకు విశేష స్పందన లభిస్తోంది. ఇది ఒక రకంగా సంజయ్ కు ఊరట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+