ముత్యం రెడ్డి, ముత్తా అరెస్టు
హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కాకినాడలో స్వతంత్ర అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణను, మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.గడువు ముగిసిన తర్వాత కూడా ముత్యం రెడ్డి ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ముత్తా గోపాలకృష్ణపై కూడా అదే ఆరోపణలు వచ్చాయి.
కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.గడువు ముగిసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. మహబూబ్ నగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications