నేను తప్పేం మాట్లాడలేదు: వైయస్

YS Rajasekhar Reddy
గుంటూరు: తెలంగాణ విషయంలో తానేం తప్పు మాట్లాడలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆంధ్ర భోజన హోటల్ పై దాడి చేస్తారా అని ఆయన అడిగారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర కార్పోరేట్ కాలేజీలను తరిమి కొడతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడారని, కెసిఆర్ మాటలను మహా కూటమి నాయకులు ఖండించలేదని ఆయన చెప్పారు. కెసిఆర్ చేత తప్పయిందని మహా కూటమి నేతలు చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ ఆంధ్రులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలు తాను కొత్తగా ఏమీ మాట్లాడడం లేదని, ఇంతకు ముందు కూడా మాట్లాడానని ఆయన అన్నారు.

తనపై ప్రతిపక్షాలు ఎవరికైనా పిర్యాదు చేసుకోవచ్చునని, ఎన్నికల సంఘానికే కాదు అంతకన్నా పెద్ద సంస్థకు దేనికైనా ఫిర్యాదు చేసుకోవచ్చునని, తానేమీ ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్లు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే తన పరపతి ఢిల్లీలో పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మహా కూటమి గెలిస్తే ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పానని, అదేమీ తప్పు కాదని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బ్యానర్ ఏం రాశారంటూ పత్రికను తీసుకుని చూశారు. ఈనాడు రాసింది కాబట్టి తాను వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన వైఖరి తీసుకున్నందుకు తనను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభినందించినట్లు ఆయన తెలిపారు. తెరాసతో 2004 ఎన్నికల్లో పొత్తును వ్యతిరేకించానని, ఆ తర్వాత తన వైఖరిని అధిష్ఠానం సమర్థించిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+