తొడ కొడితే పౌరుషం కాదు: పవన్
గుంటూరు: మీసం మెలేసి, తొడ కొడితే పౌరుషం కాదని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యలపై పోరాడే ధైర్యం ఉండాలని ఆయన అన్నారు. సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆదివారం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రచారం సాగించారు.
తాము సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, సమస్యలపై పోరాడే ధైర్యం తమకు ఉందని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణపై విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications