వైయస్ ఊసరవెల్లి: బాలయ్య

Balakrishna
విజయవాడ: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనం హైదరాబాదుకు విదేశీయులం అవుతామని ముఖ్యమంత్రి అనడాన్ని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎన్నికల ప్రచార సభలో ఆయన సోమవారం ప్రసంగించారు. కాంగ్రెసు దళారీలు ప్రజలను దోచుకున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుది దళారుల ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు ప్రభుత్వం ఆదుకుంటే ఆరు వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ఆయన అడిగారు. ప్రజారాజ్యం పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మెచ్చుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం కాంగ్రెసు సంస్కృతి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిన న్యాయానికి పెద్ద పీట వేసిందని ఆయన చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల రాజకీయ చైతన్యం వచ్చి ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలవారు ఎంతో మంది నాయకులుగా ఎదిగారని ఆయన అన్నారు. బాలయోగి లోకసభ స్పీకర్ కావడాన్ని, ప్రతిభా భారతి శాసనసభ స్పీకర్ కావడాన్ని ఆయన ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+