వైయస్, బాబు ఫిక్సింగ్: చిరు

Chiranjeevi
పాలకొల్లు: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. కాంగ్రెసుతో తమ పార్టీ మ్యాచ్ ఫిక్సింగుకు పాల్పడిందనే చంద్రబాబు ఆరోపణపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆయన సోమవారం ఉదయం పాలకొల్లులో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పాలకొల్లు నుంచి ఆయన శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి అవినీతిపై చివరి దాకా పోరాడినట్లు పోరాడి చివరి నిమిషంలో వదిలేయడం గమనిస్తే వారిద్దరి మధ్యనే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అర్థమవుతుందని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే చంద్రబాబు ఆ మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల్లో మనీ, మద్యం ప్రభావం తక్కవగా ఉంటుందని ఆయన అన్నారు. తాను పోటీ చేస్తున్న తిరుపతిలో రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలా వంటి పదాలు వాడడం ద్వారా చంద్రబాబు కల్లుగీత కార్మికులను అవమానిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ప్రజలు మురిగి పోతారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఛాంపియన్లం తామేనని ఆయన అన్నారు. రెండో విడత పోలింగ్ జరిగే 141 అసెంబ్లీ స్థానాల్లో 80 శాతం తమకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+