కొలొంబో: ఎల్టీటిఈ నేత ప్రభాకరన్ 24 గంటల్లో ప్రభుత్వానికి లొంగిపోవాలని లంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే అల్టిమేటం జారీ చేశారు. ఎల్టీటిఈ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉన్న 70 వేల మంది తమిళుల్లో 35 వేలమంది ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపారు.
యుద్ధ ప్రాంతం నుంచి పారిపోతున్న పౌరులను తీసుకు రావడానికి శ్రీలంక నావికా దళం పడవలు రంగంలోకి దిగాయి. పౌరులమధ్య ఆత్మాహుతి దాడి జరగడంతో 17 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.